అక్షరటుడే, వెబ్‌డెస్క్: Municipal elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ (Janasena party) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీతో పొత్తు ఉంటుందా అనే చర్చ ప్రారంభం అయింది. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (BJP state president Ramachandra Rao) క్లారిటీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ ప్రకటించారు. తమకు పొత్తు అవసరం లేదన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ జత కట్టిందన్నారు. కానీ తెలంగాణలో పరిస్థితులు వేరని చెప్పారు. తాము మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని చెప్పారు.
Municipal elections | పవన్‌దే నిర్ణయం
బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు వ్యాఖ్యలపై జనసేన నాయకులు స్పందించారు. పొత్తులపై తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌దే (Pawan Kalyan) తుది నిర్ణయమని చెప్పారు. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయాన్ని ఆయన నిర్ణయిస్తారని తెలంగాణ జనసేన ఇన్‌ఛార్జి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. పొత్తు ఉన్నా లేకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలంగా ఉన్న చోట్ల అభ్యర్థులను నిలబెడతామన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు.