అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | బైక్ అదుపు తప్పి డివైడర్‌ను (divider) ఢీకొట్టగా దంపతులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన సదాశివనగర్ మండలం (Sadashivanagar Mandal) కుప్రియాల్ స్టేజీ వద్ద మంగళవారం చోటుచేసుకుంది.
సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కమ్మరి నవీన్, సౌందర్య రోజు మాదిరిగానే కామారెడ్డికి పనికి వెళ్తున్నారు. కుప్రియాల్ స్టేజీ (Kupriyal Stage) వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకొని తమ వాహనంలో ఇద్దరిని కామారెడ్డి జీజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో నవీన్‌కు స్వల్ప గాయాలు కాగా, సౌందర్య తలకు బలమైన గాయమైంది. దాంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
