అక్షరటుడే, ముప్కాల్: Mupkal | మండల కేంద్రంలోని దూలగుట్ట సమీపంలో భక్తిశ్రద్ధలతో భీమన్న కల్యాణాన్ని (Bhimanna Kalyanam) నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. అనంతరం కల్యాణ మహోత్సవం (Kalyana Mahotsavam) నిర్వహించారు.
ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించినట్లు కల్యాణ కమిటీ అధ్యక్షుడు చింతకింది నర్సయ్య తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదానంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కంచు శ్రీధర్, నరేష్, ఉదయ్ కిరణ్, మోహన్, ప్రతాప్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
