అక్షరటుడే, ఇందూరు: TGNPDCL | వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని ఎస్ఈ (ఆపరేషన్స్) రాజేశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్పీడీఎసీఎల్ కార్యాలయంలో (NPDACL office) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులంతా కలిసి జిల్లాను ముందు వరసలో నిలబెట్టాలన్నారు.
పొలంబాట, పట్టణ బాట నిర్వహించి వినియోగదారులకు విద్యుత్ భద్రత (electricity safety) గురించి అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని నియంత్రికలు పాడవకుండా జాగ్రత్త పడాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లను తగ్గించాలని, డీటీఆర్లను ఇన్స్పెక్షన్ చేసి బాగు చేయాలన్నారు. సమావేశంలో టెక్నికల్ డీఈ రమేష్, ఎస్ఏవో శ్రీనివాస్ డీఈలు ఎం. శ్రీనివాస్, ఎండీ ముక్తార్, వెంకటరమణ, హరిచంద్ర, రఘు, ఏడీఈ తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
