అక్షరటుడే, ఇందూరు: MLA Sudarshan Reddy | ప్రభుత్వ పాఠశాలల్లో (government schools) నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని.. నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని (Savitribai Phule birth anniversary) నిర్వహించారు.
MLA Sudarshan Reddy | విద్యారంగానికి విశేష ప్రాధాన్యత..
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగానికి (education sector) రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.కోట్లు వెచ్చిస్తోందన్నారు. సుమారు రూ.200 కోట్ల ఖర్చు చేస్తూ సమీకృత రెసిడెన్షియల్ స్కూల్‌ను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియను ఇటీవలే పూర్తి చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. విద్యలో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు.
MLA Sudarshan Reddy | సొంత బిడ్డలుగా భావించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను సొంత బిడ్డలుగా భావిస్తూ ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. పాఠశాల దశలో పదో తరగతి ఎంతో కీలకమైందని ఉపాధ్యాయులు సరైన దిశా నిర్దేశం చేస్తే చక్కటి మార్గంలో పయనిస్తూ భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దుకుంటారని చెప్పారు. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం గడుపుతారని గుర్తు చేశారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ చదువు పట్ల ఏకాగ్రత ఆసక్తి ఉండేలా చూడాలన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, రాష్ట్ర సహకార సంఘాల ఫెడరేషన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.