అక్షరటుడే, ఎల్లారెడ్డి: indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెనువెంటనే ఇళ్లు నిర్మించుకుంటే బిల్లులు త్వరితగతిన మంజూరవుతాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) పేర్కొన్నారు. తాడ్వాయి మండలం (Tadwai mandal) బ్రాహ్మణపల్లిలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్‌వాడీ భవనానికి గురువారం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మాణం కూడా చేయలేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. బ్రాహ్మణపల్లిలో 31 ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma houses) బిల్లులు మంజూరు చేశామని చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అంగన్‌వాడీ భవనం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, సీసీ రోడ్లు, హెల్త్ సబ్ సెంటర్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
