అక్షరటుడే, కామారెడ్డి: KTR | రాబోయే మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) సిద్ధంగా ఉండాలని, అందుకోసం క్యాడర్ను సంసిద్ధం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
KTR | హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో..
హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో శనివారం మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao), ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారని, అనేక చోట్ల గెలుపొందారన్నారు.
ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో పార్టీ కామారెడ్డి, నిజామాబాద్ అధ్యక్షులు ముజీబొద్దీన్, జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta), షకీల్, జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.