Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా బాలన్న

Nizamabad | బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా బాలన్న

జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్య నిర్వాహక కార్యదర్శిగా బాలన్న నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ నియామక పత్రం అందించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad | జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్య నిర్వాహక కార్యదర్శిగా బాలన్నను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (District President Narala Sudhakar) తెలిపారు. మహేంద్ర సంఘం జిల్లా సీనియర్ నాయకుడిగా గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘానికి (C Welfare Association) ఆయన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

బాలన్న మాట్లాడుతూ.. బీసీ సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రసాద్, దేవేందర్, రవి, శంకర్, అజయ్, శ్రీలత, స్వామి, చంద్రకాంత్, రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.