81
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో (Ayyappa Swamy Temple) పంచామృతాలతో అభిషేక కార్యక్రమాన్ని స్వాములు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గణపతిపూజ (Ganapati Puja), హోమం చేశారు.
Yellareddy | సాయంత్రం పడిపూజ మహోత్సవం..
సామూహిక పడిపూజ మహోత్సవాన్ని గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని ఈ పూజ కార్యక్రమానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madan Mohan), మాజీ ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి, జనార్దన్ గౌడ్లు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి అయ్యప్ప స్వాములు హాజరవుతున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
