HomeతెలంగాణAyyappa Swamy | అయ్యప్ప భక్తులకు భిక్ష.. మత సామరస్యాన్ని చాటిన ముస్లిం కుటుంబం

Ayyappa Swamy | అయ్యప్ప భక్తులకు భిక్ష.. మత సామరస్యాన్ని చాటిన ముస్లిం కుటుంబం

ప్రపంచంలో పరమత సహనానికి మారుపేరుగా నిలుస్తోంది భారత్​. హిందూ – ముస్లిం కలిసి ఉంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంటారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ayyappa Swamy | తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఓ ముస్లిం కుటుంబం మతసామరస్యాన్ని చాటుతోంది. ఈ జిల్లాలోని హుజూర్ నగర్ మండలం బూరుగడ్డలో మాజీ సర్పంచి షేక్ సలీమాబేగం చిన్న కుమారుడు షేక్ ఆలీ పాషా, ఆశా దంపతులు ఉన్నారు.

వీరికి మున్నా, రిజ్వానా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం గ్రామంలో అన్ని వర్గాలతో సామరస్యంగా ఉంటూ వస్తోంది. అన్ని మతాలను ఈ కుటుంబం ఆదరిస్తోంది.

Ayyappa Swamy | మాలధారణ భక్తులకు..

కాగా, గ్రామంలో 60 మంది అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. వీరు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో నిత్యం పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రామంలోని కొందరు హిందువులు అయ్యప్ప మాలధారణ స్వాములకు అన్నదానం చేపట్టారు.

వీరిలాగే సలీమా బేగం చిన్న కొడుకు అలీ పాషా కుటుంబం కూడా, అయ్యప్ప మాలధారులకు వారి గృహంలో భిక్ష ఏర్పాటు చేశారు. అయ్యప్ప భక్తులు కూడా వారి అన్నదానాన్ని స్వీకరించి, పర మత సహనం చూపారు.