అక్షరటుడే, ఇందూరు : Ayyappa Mahapadi Puja | నగరంలోని మైసమ్మ వీధిలో (Mysamma Street) వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. బీజేవైఎం నాయకుడు ఆశిష్ నేత (BJYM leader Ashish Netha) స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం పడిపూజ నిర్వహించగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, బీఆర్ఎస్ పటాన్చెరువు నియోజకవర్గ నేత, ఆర్కే ఫౌండేషన్ ఛైర్మన్ కాల్వగడ్డ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని అన్నారు. అయ్యప్ప దీక్ష (Ayyappa Deeksha) సన్మార్గాన్ని నేర్పిస్తుందని వివరించారు. పసుపుబోర్డు ఛైర్మన్ పల్లెగంగారెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంతో దైవ చింతన ఎంతో ముఖ్యమన్నారు. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. పటాన్చెరువు నియోజకవర్గ నేత రాజ్‌కుమార్ మాట్లాడుతూ భక్తి పారవశ్యంతో, అకుంఠిత దీక్షతో స్వాములు 41 రోజులు దీక్ష చేయడం అభినందయనీయన్నారు. అయ్యప్ప మహాపడి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రాజ్‌కుమార్‌ను ఎమ్మెల్యే ధన్పాల్ సన్మానించారు.