HomeతెలంగాణArmoor | ఆటో బోల్తా.. పలువురికి గాయాలు..

Armoor | ఆటో బోల్తా.. పలువురికి గాయాలు..

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్:Armoor | ఆటో బోల్తాపడి పలువురికి గాయాలైన ఘటన ఆలూర్​ మండల(Alur Mandal) కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్​కు చెందిన సుమారు ఏడుగురు మహిళలు శనివారం తెల్లవారుజామున ఆర్మూర్​ మున్సిపల్​ కార్యాలయం(Municipal Office)లో పనినిమిత్తం ఆటోలో బయలుదేరారు. గుగుపల్లి శివారులోని దర్గా వద్దకు రాగానే పంది అడ్డురాగా తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. దీంతో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు ఫోన్​ చేయగా క్షతగాత్రుడిని నిజామాబాద్​లోని జీజీహెచ్​(GGH)కు తరలించారు.

Must Read
Related News