అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DCC Presidents | రాష్ట్రంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవులను తాజాగా భర్తీ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామక ప్రతిపాదనకు హైకమాండ్ ఆమోదం తెలిపింది. దీంతో కొత్త అధ్యక్షుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ప్రకటించారు.
రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం చాలా రోజులుగా నాయకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇటీవల 22 మందితో పరిశీలకుల బృందాన్ని పంపింది. వారు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా తాజాగా జిల్లా అధ్యక్షులను నియమించారు.
తెలంగాణ జిల్లా కాంగ్రెస్ (Congress) కమిటీల అధ్యక్షుల నియామక ప్రతిపాదనను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే (Kharge) ఆమోదించారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. తక్షణమే కొత్త నియామకాలు అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
DCC Presidents | పదవులు ఎవరికంటే..
- ఆదిలాబాద్ – నరేశ్ జాదవ్
- ఆసిఫాబాద్ – ఆత్రం సుగుణ
- భద్రాద్రి కొత్తగూడెం – తోట దేవి ప్రసన్న
- భువనగిరి – బీర్ల ఐలయ్య
- గద్వాల్ – రాజీవ్ రెడ్డి
- హన్మకొండ – ఎంగల వెంకట్ రామ్ రెడ్డి
- హైదరాబాద్ – సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
- జగిత్యాల – గజేంగి నందయ్య
- జనగామ – లకవత్ ధన్వంతి
- జయశంకర్ భూపాలపల్లి – బట్టు కరుణాకర్
- కామారెడ్డి – మల్లికార్జున్ ఏలే
- కరీంనగర్ – మేడిపల్లి సత్యం
- కరీంనగర్ కార్పొరేషన్ – అంజన్ కుమార్
- ఖైరతాబాద్ – మోతా రోహిత్ ముదిరాజ్
- ఖమ్మం – నూతి సత్యనారాయణ
- ఖమ్మం కార్పొరేషన్ – దీపక్ చౌదరి
- మహబూబాబాద్ – డాక్టర్ భూఖ్య ఉమా
- మహబూబ్ నగర్ – సంజీవ్ ముదిరాజ్
- మంచిర్యాల – రఘునాథ్ రెడ్డి
- మెదక్ – ఆంజనేయులు గౌడ్
- మేడ్చల్ మల్కాజిగిరి – తోటకూర వజ్రేశ్ యాదవ్
- ములుగు – పైడాకుల అశోక్
- నాగర్ కర్నూల్ – వంశీకృష్ణ
- నల్గొండ – పున్న కైలాష్ నేత
- నారాయణపేట – ప్రశాంత్‌కుమార్ రెడ్డి
- నిర్మల్ – వెడ్మ బొజ్జు
- నిజామాబాద్ – కాట్పల్లి నగేశ్‌రెడ్డి
- నిజామాబాద్ కార్పొరేషన్ – బొబ్బిలి రామకృష్ణ
- పెద్దపల్లి – ఎంఎస్ రాజ్ ఠాకూర్
- రాజన్న సిరిసిల్ల – సంగీతం శ్రీనివాస్
- సికింద్రాబాద్ – దీపక్ జాన్
- సిద్దిపేట – తూంకుంట ఆంక్షా రెడ్డి
- సూర్యాపేట – గుడిపాటి నర్సయ్య
- వికారాబాద్ – దారా సింగ్ జాదవ్
- వనపర్తి – శివసేనరెడ్డి
- వరంగల్ – మహ్మద్ ఆయూబ్
