LIC | ఎల్‌ఐసీ నుంచి మరో స్కీమ్.. ఒక్కసారి కడితే జీవితాంతం బీమా

అక్షరటుడే, వెబ్​డెస్క్​: LIC | ఎల్‌ఐసీ ‘జీవన్‌ ఉత్సవ్‌’ (Jeevan Utsav) పేరుతో కొత్త పాలసీని తీసుకువచ్చింది. పొదుపుతోపాటు బీమా కోరుకునే వారి కోసం సింగిల్‌ ప్రీమియం ఆప్షన్‌తో ఈ స్కీమ్‌ను లాంచ్‌ చేసింది. ఇది నాన్ లింక్డ్‌, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ సేవింగ్స్ (individual savings), హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఒక్కసారి ప్రీమియం చెల్లించి జీవితాంతం ఇన్సూరెన్స్ కవరేజ్, సేవింగ్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈనెల 12న ప్రారంభమయ్యే ఈ స్కీమ్‌పై మార్చి 2 వరకు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: LIC | ఎల్‌ఐసీ ‘జీవన్‌ ఉత్సవ్‌’ (Jeevan Utsav) పేరుతో కొత్త పాలసీని తీసుకువచ్చింది. పొదుపుతోపాటు బీమా కోరుకునే వారి కోసం సింగిల్‌ ప్రీమియం ఆప్షన్‌తో ఈ స్కీమ్‌ను లాంచ్‌ చేసింది. ఇది నాన్ లింక్డ్‌, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ సేవింగ్స్ (individual savings), హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఒక్కసారి ప్రీమియం చెల్లించి జీవితాంతం ఇన్సూరెన్స్ కవరేజ్, సేవింగ్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈనెల 12న ప్రారంభమయ్యే ఈ స్కీమ్‌పై మార్చి 2 వరకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనుంది. స్కీమ్‌ వివరాలిలా ఉన్నాయి.

30 రోజుల వయసున్నవారి నుంచి 65 ఏళ్ల వయసున్న వారి వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీస బీమా మొత్తం రూ.5 లక్షలు. గరిష్ట పరిమితి లేదు. పాలసీ కాలపరిమితిలో ప్రతి వెయ్యి రూపాయలకు ఏటా రూ.40 చొప్పున గ్యారంటీడ్‌ అడిషన్స్‌ జమ అవుతాయి. ఇందులో రెండు ఆప్షన్లున్నాయి. పాలసీదారుడు ఆప్షన్‌ 1(రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ బెనిఫిట్‌), ఆప్షన్‌ 2(ఫ్లెక్సీ ఇన్‌కమ్‌ బెనిఫిట్‌)లను ఎంచుకోవచ్చు. రెగ్యులర్‌ బెనిఫిట్‌ ఆప్షన్‌ కింద పాలసీదారులు ఎంచుకున్న వ్యవధిని బట్టి (7 నుంచి 17 ఏళ్ల తర్వాత) ఏటా ప్రాథమిక బీమా మొత్తంలో 10 శాతం ఆదాయం పొందవచ్చు. వ్యక్తుల అవసరాలను బట్టి దీన్ని ఎంచుకోవచ్చు.

ఫ్లెక్సీ ఇన్‌కం బెనిఫిట్‌ ఆప్షన్‌ కింద పాలసీదారులు తమకు రావాల్సిన 10 శాతం ఆదాయాన్ని అప్పుడే తీసుకోకుండా ఎల్‌ఐసీ వద్దే దాచి పెట్టొచ్చు. ఇలా ఉంచిన మొత్తంపై సంస్థ వార్షిక వడ్డీ (annual interest) 5.5 శాతం (వార్షిక చక్రవడ్డీ) చెల్లిస్తుంది. పాలసీదారులు తమ అవసరానికి అనుగుణంగా ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అప్పటివరకు జమ అయిన మొత్తంలో 75 శాతం వరకు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి పాలసీ మొత్తంతో పాటు, అప్పటివరకూ జమ అయిన గ్యారంటీడ్‌ అడిషన్స్‌ అందిస్తారు. గడువు తీరే వరకూ జీవించి ఉంటే మెచ్యూరిటీ ప్రయోజనం కింద ప్రాథమిక బీమా మొత్తం లేదా సింగిల్‌ ప్రీమియంకు 1.25 రెట్ల (ఏది ఎక్కువగా ఉంటే అది)కు గ్యారంటీడ్‌ అడిషన్స్‌ కలిపి చెల్లిస్తారు. ఎల్‌ఐసీ యాక్సిడెంట్‌ డెత్‌ అండ్‌ డిజెబిలిటీ బెన్‌ఫిట్‌ రైడర్‌, ఎల్‌ఐసీ న్యూటర్మ్‌ అష్యూరెన్స్‌ రైడర్‌ వంటివి జోడించుకోవడానికి అవకాశం ఉంది. దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Related articles

Feb 26 Gold Prices | మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం.. వెండి ధ‌ర‌ ఎంతంటే!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 26 Gold Prices | భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య అనిశ్చితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో...

Virosh Wedding Celebrations | మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక‌ల వివాహం… ‘నో మొబైల్’ రూల్‌తో ప్రైవేట్ వెడ్డింగ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Virosh Wedding Celebrations | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26 ఉదయం 10.10 గంటలకు ఉద‌య్‌పూర్‌లో...

Feb 26 Zodiac signs | ఆడవారితో మగవారికి.. మగవారితో ఆడవారికి వ్యాపారంలో అనుకూలం.. ఈ రాశుల వారికి తిరుగులేని లాభాలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 26 Zodiac signs | గ్రహాలు, నక్షత్రాల స్తితిగతుల వల్ల ఈ రోజు (గురువారం, ఫిబ్రవరి 26) పలు horoscope...

February 26 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 26 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 26,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...