అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rashmika Mandanna | టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) స్లో అండ్ స్టడీగా వెళుతున్నాడు. అమెరికాలో ఉద్యోగం మానేసి మరీ విజయ్ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చాడు ఆనంద్ దేవరకొండ. పీరియాడికల్ లవ్ స్టోరీ దొరసాని హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయినప్పటికీ.. ఉత్తమ డెబ్యూ హీరోగా ఆనంద్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే, బేబీ, గమ్ గమ్ గణేశ వంటి చిత్రాలు చేశాడు. వీటిల్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ క్లాసిక్ హిట్ ఇవ్వగా.. బేబీ మూవీ ఆనంద్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇందులో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటించింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు.
అయితే ఇప్పుడు మరోసారి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (Vaishnavi chaitanya) జంటగా ఓ చిత్రం రాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం నేడు ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకుంది. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్ గా రష్మిక మందన్న(Rashmika Mandanna) గెస్ట్‌గా వచ్చి క్లాప్ కొట్టింది. దీంతో విజయ్ తమ్ముడు ఆనంద్ కోసం రష్మిక మరోసారి రావడం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందనే ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో విజయ్ తమ్ముడి సినిమా ఓపెనింగ్ కోసం రష్మిక రావడం హాట్ టాపిక్ అయింది.
కొద్ది రోజుల క్రితం ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈటీవి విన్ ఓటీటీలో వచ్చిన #90’s (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఈ సినిమా ఉంటుందని వీడియోతో అర్ధమైంది. 90’s సిరీస్‌లో చిన్నపిల్లవాడు అయిన ఆదిత్య Aditya పది సంవత్సరాల తరువాత పెద్దవాడు అయితే అతని లవ్ స్టోరీలో ఎలాంటి ఆసక్తికర సంఘటనలు జరగనున్నాయి అనేది సినిమాలో చూపించనున్నారు. 90s సిరీస్ లో ఉన్న శివాజీ, వాసుకి ఈ సినిమాలో కూడా ఉంటారని సమాచారం.