అక్షరటుడే, వెబ్డెస్క్ : Anchor Shivajyothi | యాంకర్ శివజ్యోతి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదం (Srivari Prasadam)పై ఆమె చేసిన వ్యాఖ్యలను భక్తులు ఖండించారు.
తిరుమల (Tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
Anchor Shivajyothi | క్యూ లైన్లో..
కాగా, యాంకర్ శివజ్యోతి (Anchor Shivajyothi) తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లారు. క్యూ లైన్లో ఉన్న సమయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని ఆమె తీసుకున్నారు. ప్రసాదం తీసుకోవడంపై ఆమె వీడియో తీశారు. తిరుపతిలో కాస్ట్లీ ప్రసాదం అడుకున్నామంటూ కామెంట్ చేశారు. రిచెస్ట్ బిచ్చగాళ్లం అని శివజ్యోతి వ్యాఖ్యలు చేశారు. ఆమె తీరుపై భక్తులు, హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఉచితంగా ఇచ్చే స్వామి వారి ప్రసాదాన్ని అడుక్కోవడం అనడం, నవ్వుతూ కామెంట్ చేయడంపై మండిపడ్డాయి. భక్తులకు శివ జ్యోతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలో శివజ్యోతి వెనక్కి తగ్గారు. బహిరంగ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. తప్పుగా మాట్లాడాను క్షమించమంటూ వేడుకున్నారు. తాను తప్పుడు ఉద్దేశంతో అనలేదని చెప్పుకొచ్చారు. తెలిసో తెలియకో అన్నట్లు పేర్కొన్నారు. తనను క్షమించమని విన్నవించారు.
