Homeఆంధప్రదేశ్Tirumala | వివాదంలో యాంకర్ శివజ్యోతి.. శ్రీవారి ప్రసాదంపై వ్యాఖ్యలు

Tirumala | వివాదంలో యాంకర్ శివజ్యోతి.. శ్రీవారి ప్రసాదంపై వ్యాఖ్యలు

యాంకర్​ శివజ్యోతి వివాదంలో చిక్కుకున్నారు. తిరుపతిలో కాస్ట్లీ ప్రసాదం అడ్డుకున్నామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | యాంకర్​ శివజ్యోతి వివాదంలో చిక్కుకున్నారు. ఎంతో మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదం (Srivari Prasadam)పై ఆమె చేసిన వ్యాఖ్యలను భక్తులు ఖండిస్తున్నారు.

తిరుమల (Tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే యాంకర్​ శివజ్యోతి (Anchor Shivajyothi) తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లారు. క్యూ లైన్​లో ఉన్న సమయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని ఆమె తీసుకున్నారు. ప్రసాదం తీసుకోవడంపై ఆమె వీడియో తీశారు. తిరుపతిలో కాస్ట్లీ ప్రసాదం అడ్డుకున్నామంటూ కామెంట్ చేశారు. రిచెస్ట్ బిచ్చగాళ్లం అని శివజ్యోతి వ్యాఖ్యలు చేశారు. ఆమె తీరుపై భక్తులు, హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఉచితంగా ఇచ్చే స్వామి వారి ప్రసాదాన్ని అడుక్కోవడం అనడం, నవ్వుతూ కామెంట్ చేయడంపై మండిపడుతున్నాయి. భక్తులకు శివ జ్యోతి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తున్నాయి. కాగా శివజ్యోతి గతంలో ఓ ఛానెల్​లో యాంకర్​గా పని చేసింది. ఆ సమయంలో ఆమె పాత్రకు ఎంతో పేరు వచ్చింది. అనంతరం బిగ్​బాస్​లో సైతం పాల్గొంది.