అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Gangasthan | గుట్టుచప్పుడు కాకుండా మత్తుపదార్థాలను తరలిస్తున్న ముగ్గురిని నార్కోటిక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్ ఎస్హెచ్వో పూర్ణేశ్వర్ (Narcotics SHO Purneshwar) వివరాలు వెల్లడించారు.
నగర శివారులోని గంగాస్థాన్ సమీపంలో మత్తుపదార్థాల సరఫరా జరుగుతోందనే పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ పోలీసులు నిఘా వేశారు. ఆ మార్గంలో ముగ్గురు అనుమానిత వ్యక్తులు ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీలు చేశారు. కారులో రూ.1.50 లక్షల విలువ చేసే 150 గ్రాముల అల్ప్రాజోలం (Alprazolam) స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీసులకు అప్పజెప్పినట్లు ఎస్హెచ్వో పూర్ణేశ్వర్ పేర్కొన్నారు. ఈ దాడిలో రూరల్ పోలీసులు సైతం పాల్గొన్నారు.
