అక్షరటుడే, వెబ్డెస్క్ : Drinking Water | హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు జలమండలి అధికారులు కీలక సూచనలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 26న తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1,2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చడానికి చర్యలు చేపట్టారు. దీని కోసం నాసర్లపల్లి జలమండలి (Jala Mandali) పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్లకు బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నారు. ఫలితంగా పలు ప్రాంతాలకు నీటిని తాగునీటి సరఫరాలో పాక్షిక అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు.
Drinking Water | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
నగరంలోని చార్మినార్, వినయ్ నగర్, బొజగుట్ట, రెడ్ హిల్స్, నారాయణ గూడ, మారేడ్పల్లి, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, రియాసత్ నగర్, సాహెబ్ నగర్, హయత్ నగర్, సైనిక్ పురి, ఉప్పల్, హఫీజ్పేట్, రాజేంద్ర నగర్, మణికొండ, బోడుప్పల్, మీర్ పేట్ డివిజన్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
