88
అక్షరటుడే, బాన్సువాడ : Aksharatoday Calendar | నేటి సమాజంలో వార్తలను వేగంగా అందిస్తూ అనతికాలంలోనే ‘అక్షరటుడే’ (Aksharatoday) పాఠకుల అభిమానాన్ని చూరగొంటోందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ‘అక్షరటుడే’ క్యాలెండర్లను ఆవిష్కరించారు.
Aksharatoday Calendar | మారుతున్న కాలానికి అనుగుణంగా..
ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi) మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పత్రికారంగం డిజిటల్ యుగానికి మారుతోందన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా.. వార్తలను వేగంగా ప్రజలకు అందజేస్తూ ‘అక్షరటుడే’ పాఠకుల మన్ననలు పొందుతోందన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ ‘అక్షరటుడే’ ప్రతినిధి ప్రచేతన్ (Representative Prachetan), సబ్‌కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.