ACB Case | ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఏఈ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) చేపడుతున్నా.. లంచాలు తీసుకోవడం మాత్రం మానడం లేదు. పైసలు ఇస్తేనే పనులు చేపడుతున్నారు. అయితే ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పడుతున్నారు. తాజాగా ఎన్పీడీసీఎల్ ఏఈని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వనపర్తి (Wanaparthy) జిల్లా గోపాల్‌పేటలో రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీకి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) చేపడుతున్నా.. లంచాలు తీసుకోవడం మాత్రం మానడం లేదు. పైసలు ఇస్తేనే పనులు చేపడుతున్నారు. అయితే ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పడుతున్నారు. తాజాగా ఎన్పీడీసీఎల్ ఏఈని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

వనపర్తి (Wanaparthy) జిల్లా గోపాల్‌పేటలో రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. వనపర్తి సర్కిల్, డివిజన్‌లోని గోపాల్‌పేట సెక్షన్ సహాయక ఇంజనీరు(ఆపరేషన్స్)గా నర్వ హర్షవర్ధన్ రెడ్డి పని చేస్తున్నాడు. ఓ రైతు పొలంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడానికి ఏఈ రూ.40 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో రైతు బంధువు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం రూ.20 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ఏఈని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.

ACB Case | లంచం ఇవ్వొద్దు

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.

ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.