HomeతెలంగాణACB Raid | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కార్మిక శాఖ అధికారి

ACB Raid | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కార్మిక శాఖ అధికారి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. ప్రతి పనికి లంచం తీసుకుంటున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేపడుతున్నారు. అంత్యక్రియల ఖర్చు కోసం వచ్చే డబ్బులు ఇవ్వడానికి సైతం ఓ అధికారి లంచం అడిగాడు.

రాష్ట్రంలో ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు ఏ మాత్రం బయపడటం లేదు. లంచం తీసుకోవడం కూడా కొందరు తమ హక్కుగా భావిస్తున్నారు. తాజాగా ఖమ్మం (Khammam) జిల్లా సహాయ కార్మిక అధికారి కర్నె చందర్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేసుకున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి అతడి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చు, ఇతర ఖర్చుల కోసం రూ.1.30 లక్షలు వస్తాయి. ఆ డబ్బుల కోసం మృతుడి కుమారుడు దరఖాస్తు చేసుకున్నాడు.

ఆ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపి, రూ.1.30 లక్షలు మంజూరు చేయడానికి జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి చందర్​ రూ.15 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమచారం ఇచ్చాడు. ఈ మేరకు సోమవారం లంచం తీసుకుంటుండగా సహాయ కార్మిక శాఖ అధికారి (Assistant Labour Officer) చందర్​ను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేపట్టారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. కాగా అంత్యక్రియల డబ్బుల కోసం కూడా లంచం అడిగిన సందరు అధికారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే నీచమైన వారు ఉంటారా.. అని సోషల్​ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. లంచాలు తీసుకునే వారిని ఉద్యోగాల్లో నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ACB Raid | లంచం ఇవ్వొద్దు

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.