Homeజిల్లాలునిజామాబాద్​Kammarpally | ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరిన యువకుడు

Kammarpally | ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరిన యువకుడు

కమ్మర్​పల్లిలోని హాసాకొత్తూర్​ యువకుడు కువైట్​లో పోలీసుల చెరలో ఉండగా ప్రభుత్వచొరవతో బయటకు వచ్చాడు. నేడు తిరిగి స్వదేశానికి చేరాడు.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpally | కువైట్​కు వెళ్లిన యువకుడు అక్కడ తప్పిపోగా ప్రభుత్వం తీసుకున్న చొరవతో తిరిగి స్వదేశానికి చేరాడు. వివరాల్లోకి వెళ్తే.. కమ్మర్​పల్లి మండలం హాసాకొత్తూర్​ గ్రామానికి (Hasakottur Village) చెందిన గిరిజన యువకుడు ఈశ్వర్ 30 రోజులుగా కువైట్​లో ఆచూకీ లేకుండా పోయాడు.

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే కాంగ్రెస్ పార్టీ (Balkonda Congress Party) బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సునీల్​రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ నాయకుడు పడిగల ప్రవీణ్ బాధిత కుటుంబ సభ్యులను హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ ప్రవాసి ప్రజావాణిలో (Prajavani) ఇన్​ఛార్జీగా ఉన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, రాష్ట్ర గల్ఫ్ అడ్వైజర్ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి విన్నవించారు.

దీంతో స్పందించిన వారు.. కువైట్​లోని భారత దేశ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. అక్కడ పోలీసుల చెరలో ఉన్న ఈశ్వర్​ను విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఈశ్వర్​ స్వదేశానికి వచ్చేందుకు కృషి చేసిన కాంగ్రెస్​ నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.