HomeజాతీయంAyodhya Ram Mandir | అయోధ్యలో అద్భుత ఘట్టం.. ధ్వజారోహణం చేసిన మోదీ

Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుత ఘట్టం.. ధ్వజారోహణం చేసిన మోదీ

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ శిఖరంపై జెండా ఎగురవేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ayodhya Ram Mandir | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో మంగళవారం ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) హాజరై ఆలయంపై కాషాయ జెండా ఎగుర వేశారు.

ధ్వజారోహణం కార్యక్రమం నేపథ్యంలో ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపి వేశారు. మంగళవారం ఉదయం ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ముందుగా ఆయన సప్తర్షి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాల రాముడిని దర్శించుకున్నారు. ప్రధాని వెంట ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్ (RSS chief Mohan Bhagwat)​, యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్​ (UP CM Yogi Adityanath) ఉన్నారు. అనంతరం మోదీ రామమందిరం పైన కాషాయ జెండాను ఎగురవేశారు. పూజారులు అత్యంత పవిత్రమైనదిగా భావించే అభిజీత్ ముహూర్తంలో ఈ వేడుక నిర్వహించారు. సూర్యుడు, ఓం, కోవిదార్ చెట్టు జెండాపై ఉన్నాయి. 191 అడుగుల ఎత్తైన ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేశారు.

Ayodhya Ram Mandir | రెండో ప్రాణప్రతిష్ఠ

అయోధ్య రామాలయం (Ayodhya Ramalayam)లో 2024 జనవరిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఆలయ నిర్మాణ పనులు అప్పటికి ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెండో ప్రాణ ప్రతిష్ఠగా అభివర్ణిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 7 వేల మంది అతిథులు పాల్గొన్నారు.

Ayodhya Ram Mandir | పటిష్ట బందోబస్తు

ప్రధాని పర్యటన, ధ్వజారోహణం నేపథ్యంలో అయోధ్యలో భద్రతను బలోపేతం చేశారు. ATS కమాండోలు, NSG స్నిపర్లు, సైబర్ బృందాలు మరియు సాంకేతిక సిబ్బందితో సహా మొత్తం 6970 మంది భద్రతా సిబ్బందిని నగరంలో మోహరించారు.