అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని ఉస్మానియా వైద్యుల బృందం (Osmania Medical Team) సోమవారం సందర్శించింది. మూత్రకోశ వ్యాధుల నిపుణుల బృందం సభ్యులు సోమవారం ఉదయం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని (Dialysis Center) పరిశీలించారు.
Yellareddy | రికార్డుల పరిశీలన..
ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో (Yellareddy Government Hospital) చికిత్స పొందుతున్న డయాలిసిస్ రోగులను పరిశీలించి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రోగ్రామ్లో మొత్తం 28 మంది డయాలిసిస్ రోగులను, రికార్డులను పరిశించింది. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నెఫ్రాలజిస్ట్ చిరంజీవి, విజేత, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, SAP క్లస్టర్ ఇన్ఛార్జి అబ్దుల్ రెహ్మాన్, శ్రీహరి, ఏజీఎస్ ఇన్ఛార్జి సందీప్, ఎల్లారెడ్డి సెంటర్ ఇన్ఛార్జి మధు, ఆస్పత్రి సిబ్బంది, ఆరోగ్యశ్రీ బృందం పాల్గొన్నారు.