అక్షరటుడే, భీమ్‌గల్: Limbadri Gutta | భీమ్‌గల్ (Bheemgal) శివారులోని శ్రీ మన్నింబాచల క్షేత్రం లింబాద్రిగుట్ట (Limbadri Gutta) అభివృద్ధికి ముందడుగు పడింది. ఇటీవల గుట్టపై లక్ష్మీనృసింహస్వామి (Lord Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma) పాల్గొన్నారు. నృసింహస్వామి దర్శనం అనంతరం ఆలయాభివృద్ధికి హామీ ఇచ్చారు.
Limbadri Gutta | పీసీసీ చీఫ్ చొరవతో నిధులు..
ఈ మేరకు మహేశ్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డితో (CM Revanth reddy) ప్రత్యేకంగా చర్చించారు. లింబాద్రి గుట్ట విశేషాలను ఆయనకు వివరించారు. అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును (Minister Jupally Krishna Rao) సైతం కలిసి లింబాద్రి గుట్ట అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
గుట్టపై టూరిజం గెస్ట్‌హౌజ్ (Tourism Guesthouse), ఇతర సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని వివరించారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు గుట్టపై టూరిజం గెస్ట్‌హౌస్ కోసం రూ.4 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్మూర్ సిద్ధుల గుట్ట అభివృద్ధికి..
ఆర్మూర్‌లో (Armoor) ప్రసిద్ధమైన సిద్ధుల గుట్టపై (Siddula Gutta) కాటేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భక్తుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం కోసం రూ.50లక్షలు మంజురు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
