Homeజిల్లాలునిజామాబాద్​Heart Medical camp | చిన్నారుల గుండెకు ఆపన్న హస్తం

Heart Medical camp | చిన్నారుల గుండెకు ఆపన్న హస్తం

ఆర్​బీఎస్​కే, అపోలో ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 18 ఏళ్ల లోపు వారికి గుండె వైద్య శిబిరం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Heart Medical camp | ఆర్​బీఎస్​కే, అపోలో ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో (Government General Hospital) 18 ఏళ్ల లోపు వారికి గుండె వైద్య శిబిరం (heart medical camp) నిర్వహించారు. డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలో వైద్య బృందం 2డీ ఎకో పరీక్షలు నిర్వహించారు.

ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 128 మంది హాజరుకాగా.. 41 మంది చిన్నారులకు శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. తదుపరి పరీక్షల కోసం 16 మంది చిన్నారులకు సలహాలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, ఆర్​బీఎస్​కే మేనేజర్ సచిన్, డాక్టర్ అరవింద్, డాక్టర్ ఫణీంద్ర, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Must Read