Homeజిల్లాలునిజామాబాద్​Education Department | డీసీఈబీ కార్యదర్శిగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిని నియమించాలి

Education Department | డీసీఈబీ కార్యదర్శిగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిని నియమించాలి

ప్రభుత్వ గెజిటెడ్​ హెచ్​ఎంనే జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శిగా ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరెడ్డి, పీఆర్​టీయూ తెలంగాణ గౌరవాధ్యక్షుడు కృపాల్​సింగ్​ కోరారు. డీఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం (District Common Examinations Department) కార్యదర్శిగా గెజిటెడ్ హెచ్​ఎంను నియమించాలని గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (Government Teachers Association) అధ్యక్షుడు సాయి రెడ్డి, పీఆర్​టీయూ (PRTU) తెలంగాణ గౌరవ అధ్యక్షుడు కృపాల్​సింగ్​ కోరారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కార్యదర్శి పదవీకాలం ముగిసిందని ఆయన హయాంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆయనకు పదవీ బాధ్యతలు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిని ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శిగా నియమించాలన్నారు.

Must Read
Related News