అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: PCC Chief | నిజామాబాద్ నగరంలోని బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) నాయకులు కోరారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను (PCC Chief Mahesh Kumar Goud) జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆధ్వర్యంలో కలిశారు.
నగరంలో గల బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తుందన్నారు. ఇందులో విద్యార్థులకు ఉన్నతా చదువులు, ఉద్యోగాలు సాధించే విధంగా కోచింగ్ ఇస్తున్నారని చెప్పారు. ఎన్నో మంచి ఫలితాలను రాబడుతున్న బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం లేకపోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. స్టడీ సర్కిల్ కోసం సొంత భవనం నిర్మించాలని కోరారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో బీసీ స్టడీ సర్కిల్ కోసం గంగాస్థాన్‌లో స్థలం కేటాయించారని పీసీసీ చీఫ్‌కు వివరించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో నిర్మాణం జరగలేదన్నారు. నగరంలో ఉన్న ఆరు బీసీ హాస్టళ్లు విద్యార్థులకు సరిపోవడంలేదని, ఇంకా రెండు బీసీ హాస్టళ్లు మంజూరు చేయించాలని కోరారు. నాయకులు కొయ్యడ శంకర్, కరిపే రవీందర్, మడవేడి వినోద్ కుమార్, నల్లగంటి శ్రీలత, బగ్గలి అజయ్, గుత్ప ప్రసాద్, నల్లగంటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.