5
అక్షరటుడే, బాన్సువాడ: Kamareddy Collector | కామారెడ్డి కలెక్టర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన కారులో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం నస్రుల్లాబాద్‌లో Nasrullabad భూభారతి Bhubharati సదస్సులో కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్ Collector Ashis Sangwan పాల్గొని కామారెడ్డికి తిరిగి వెళ్తున్నారు.
అదే సమయంలో నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తా Bomman devpalli Crossroads వద్ద ప్రమాదం జరగగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనను గమనించిన కామారెడ్డి కలెక్టర్ వెంటనే తన వాహనాన్ని ఆపారు. బాధితులతో మాట్లాడి తన వెంట ఉన్న డీపీఆర్వో వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.