IPL 2025 | సీఎస్‌కేతో డూ ఆర్ డై మ్యాచ్.. SRH తుది జట్టు ఇదే!

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | ఐపీఎల్ ipl 2025 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిల పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ SRH మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం చెన్నైలోని Chennai చెపాక్ మైదానం chepak stadium వేదికగా జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో CSK అమీతుమీ తేల్చుకోనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ చేతిలో చిత్తయిన ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ సీజన్‌లో మిగిలిన 6 మ్యాచ్‌లకు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | ఐపీఎల్ ipl 2025 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిల పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ SRH మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం చెన్నైలోని Chennai చెపాక్ మైదానం chepak stadium వేదికగా జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో CSK అమీతుమీ తేల్చుకోనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ చేతిలో చిత్తయిన ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ సీజన్‌లో మిగిలిన 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే SRH ప్లే ఆఫ్స్ చేరుతోంది.

ఈ క్రమంలోనే ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్ ఆరెంజ్ ఆర్మీకి డూ ఆర్ డై‌గా మారింది. మరోవైపు సీఎస్‌కే CSK పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ జట్టు కూడా ఆరెంజ్ ఆర్మీ తరహాలోనే 8 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచింది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వరుస పరాజయాల నేపథ్యంలో సీఎస్‌కేతో పోరులో సన్‌రైజర్స్ తమ తుది జట్టులో మార్పులు చేయనుంది. రూ. 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్‌ Ishan Kishanపై వేటు వేయనుంది. అతను తొలి మ్యాచ్‌లో సాధించిన సెంచరీ మినహా తర్వాతి ఏడు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ముంబైతో మ్యాచ్‌లోనూ వివాదాస్పద రీతిలో క్రీజును వీడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని తప్పించి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన అభినవ్ మనోహర్‌‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. చెపాక్ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో రాహుల్‌ చాహర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించే అవకాశం ఉంది.

ముంబైతో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ Mahammad Shami ని తిరిగి జట్టులోకి తీసుకోనున్నారు. దాంతో అతని స్థానంలో ఆడిన జయదేవ్ ఉనాద్కత్‌పై వేటు పడనుంది. ఈ మార్పులు మినహా మిగతా లైనప్ అలానే కొనసాగనుంది.

IPL 2025 | SRH తుది జట్టు ఇదే:

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్/అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా

ఇంపాక్ట్ ప్లేయర్: రాహుల్ చాహర్/ స్మరన్ రవిచంద్రన్.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...