అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chinese Manja | సంక్రాంతి పండుగ (Sankranthi Festival) సమీపిస్తుండటంతో ఆకాశంలో పతంగుల సందడి కొనసాగుతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు.
గాలిపటాలు ఎగరసే సమయంలో కొందరు చైనా మాంజా వినియోగిస్తున్నారు. ప్రభుత్వం దీనిని నిషేధించిన అక్రమంగా అమ్మకాలు సాగుతున్నాయి. ఈ మాంజాతో పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. తాజాగా జగిత్యాల జిల్లా (Jagtial District) మెట్పల్లిలో చైనా మాంజా మెడకు చుట్టుకుని బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇంటిముందు ఆడుకుంటున్న శ్రీహాస్ మెడకు చైనా మాంజా చుట్టుకుంది. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. మెడ భాగంలో తీవ్రంగా కోసుకుపోవడంతో నిజామాబాద్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం బాలుడు నిజామాబాద్ (Nizamabad)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీహాస్ మెడ చుట్టూ 20 కుట్లు వేసినట్లు తెలిసింది.
Chinese Manja | పోలీసులు చెబుతున్నా..
పోలీసులు, అధికారులు చైనా మాంజా వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. వాటిని ప్రభుత్వం నిషేధించిందని చెబుతున్నారు. విక్రయించిన, కొనుగోలు చేసిన కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. అలాగే చైనా మాంజాతో ఎవరికైనా గాయాలు అయితే బాధ్యుతలపై క్రిమినల్ కేసులు (Criminal Cases) పెడతామని పేర్కొన్నారు. అయినా కూడా ప్రజలు మారడం లేదు. దుకాణదారులు అక్రమంగా తెచ్చి విక్రయిస్తుండగా.. యువత సైతం చైనా మాంజా కొనుగోలు చేస్తున్నారు. పోలీసులు దాడులు చేపట్టి పెద్ద ఎత్తున మాంజాను స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా విక్రయాలు మాత్రం పూర్తిస్థాయిలో ఆగడం లేదు.