అక్షరటుడే, కామారెడ్డి : Panchayat Election | జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 21.49 శాతం నమోదైన ఓటింగ్ నమోదు కాగా.. ఉదయం 11 గంటల వరకు 56. 71 శాతానికి చేరింది.
Panchayat Election | బాన్సువాడ డివిజన్..
జిల్లాలోని బాన్సువాడ (Banswada) డివిజన్ పరిధిలో మొత్తం 1,90,296 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల వరకు 1,07,923 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాన్సువాడ మండలంలో 57.55 శాతం, బిచ్కుంద (Bichkunda) మండలంలో 61.78 శాతం, బీర్కూర్ మండలంలో 51.13 శాతం, డొంగ్లీ మండలంలో 63.57 శాతం, జుక్కల్ మండలంలో (Jukkal Mandal) 52.25 శాతం, మద్నూర్ మండలంలో 53.37 శాతం, నస్రుల్లాబాద్ మండలంలో 55.82 శాతం, పెద్దకొడప్గల్ మండలంలో 64.40 శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.