Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 32 ఫిర్యాదులు

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Police Prajavani | ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సీఐలు, ఎస్సైలతో (CIs and SIs) ఫోన్​లో మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Police Prajavani | ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సీఐలు, ఎస్సైలతో (CIs and SIs) ఫోన్​లో మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ (district police department) పని చేస్తోందని తెలిపారు. కాగా.. పోలీస్​ ప్రజావాణికి 32 ఫిర్యాదులు వచ్చాయి.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.