అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Ration Rice | అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని (ration rice) పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నగర (Nizamabad city) శివారులో దాదాపు 29 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఆ లారీని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిర్మల్ జిల్లా చించోలి మాజిద్ అనే రైస్ మిల్లు నుంచి నిజామాబాద్‌కు (Nirmal district to Nizamabad) తరలిస్తున్న క్రమంలో పోలీసులు దాడి చేసి లారీని పట్టుకున్నారు. రైస్ మిల్లులకు అడ్డా అయినా కాలూరు రోడ్డులో గల పార్కింగ్ వద్ద నిలిపి ఉంచిన లారీలో తనిఖీలు చేశారు. అందులో 29 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
