Homeతాజావార్తలుLab Technician Post | ల్యాబ్​ టెక్నీషియన్​ పోస్టులకు 1,260 మంది ఎంపిక

Lab Technician Post | ల్యాబ్​ టెక్నీషియన్​ పోస్టులకు 1,260 మంది ఎంపిక

ల్యాబ్​ టెక్నీషియన్​ పోస్టులకు 1,260 మంది ఎంపికయ్యారు. అధికారులు సోమవారం రాత్రిలోగా జాబితాను విడుదల చేయనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lab Technician Post | ల్యాబ్​ టెక్నీషియన్​ పోస్టులకు 1,260 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) ఆధ్వర్యంలో ల్యాబ్​ టెక్నీషియన్​​ పోస్టు (Lab Technician Post)లకు గతంలో పరీక్ష నిర్వహించారు. సోమవారం బోర్డు జాబితా విడుదల చేయనుంది.

తెలంగాణ (Telangana)లో ఆరోగ్య సంరక్షణ సేవలకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 1,284 పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్​ (Notification) విడుదల చేశారు. ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి MHSRB 2024 సెప్టెంబర్​​ 11న నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్​ 11న కంప్యూటర్​ బేస్ట్​ ఆధారిత పరీక్ష నిర్వహించారు. ఈ పోస్టులకు 24,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 23,323 మంది పరీక్షకు హాజరయ్యారు.

Lab Technician Post | నేడు జాబితా

మొత్తం 1,284 పోస్టులకు పరీక్ష నిర్వహించగా.. 1,260 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారి జాబితాను అధికారులు నేడు విడుదల చేయనున్నారు. హైకోర్టు (High Court) ఆదేశాల కారణంగా 4 పోస్టులు ఖాళీగా ఉంచినట్లు బోర్డు తెలిపింది. దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద 2 పోస్టులు భర్తీ కాలేదు. స్పోర్ట్స్ కేటగిరీ కింద 18 పోస్టులు ఇప్పుడు భర్తీ కాలేదని తెలిపింది. స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎంపికైన వారి జాబితాను తర్వాత విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ పోస్టుల భర్తీతో బోధనా ఆసుపత్రులు, జిల్లా/ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ల్యాబ్​ల్లో సేవలు మెరుగు పడతాయని పేర్కొంది.

Must Read
Related News