Iran | ఇరాన్ గగనతలం మూసివేత.. తిరిగి ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran | ఇరాన్​ కీలక నిర్ణయం తీసుకుంది. తన గగనతలాన్ని మూసి వేసింది. దేశంలో హింసాత్మక నిరసన నేపథ్యంలో వాణిజ్య విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఇరాన్​లో కొన్ని రోజులుగా ఆందోళనలు (Iran Protests) కొనసాగతున్న విషయం తెలిసిందే. ఇవి హింసాత్మకంగా మారాయి. ఆందోళనలను ఖమేని ప్రభుత్వం అణిచి వేస్తోంది. దీంతో ఇరాన్​పై దాడులు చేస్తామని అమెరికా (America) హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్​ తన గగనతలాన్ని మూసి వేసింది. అనంతరం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran | ఇరాన్​ కీలక నిర్ణయం తీసుకుంది. తన గగనతలాన్ని మూసి వేసింది. దేశంలో హింసాత్మక నిరసన నేపథ్యంలో వాణిజ్య విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.

ఇరాన్​లో కొన్ని రోజులుగా ఆందోళనలు (Iran Protests) కొనసాగతున్న విషయం తెలిసిందే. ఇవి హింసాత్మకంగా మారాయి. ఆందోళనలను ఖమేని ప్రభుత్వం అణిచి వేస్తోంది. దీంతో ఇరాన్​పై దాడులు చేస్తామని అమెరికా (America) హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్​ తన గగనతలాన్ని మూసి వేసింది. అనంతరం మళ్లీ ఓపెన్​ చేసింది. సుమారు 5 గంటల పాటు గగనతలాన్ని మూసి ఉంచింది.

Iran | కీలక మార్గం

ఇరాన్ వైమానిక ప్రాంతం తూర్పు-పశ్చిమ మార్గంలో ఉంది. తక్కువ సమయంలో వెళ్లడానికి ఇది విమానయాన సంస్థలకు ఉపయోగపడతోంది. తూర్పు-పశ్చిమ విమానయాన మార్గం మధ్యప్రాచ్యం అంతటా యూరప్-ఆసియా వైమానిక కారిడార్, ఇరాన్ వైమానిక ప్రాంతం కేంద్ర లింక్‌గా ఉంది. తాజాగా ఇరాన్​ ఎయిర్​ స్పేస్​ మూసివేయడంతో ఇరాన్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో విమానయాన సంస్థలకు సమయం, అదనపు ఖర్చు పెరుగుతుంది.

Iran | భారత్​పై ప్రభావం

భారతీయ విమానయాన సంస్థలు కూడా ప్రభావితమయ్యాయి, ఇరాన్ ఆకస్మిక గగనతల మూసివేతతో దాని అంతర్జాతీయ విమానాలు కొన్ని ప్రభావితమవుతాయని ఇండిగో (Indigo) తెలిపింది. ఎయిర్ ఇండియా (Air India) విమానాలు ఆలస్యం, రద్దుకు దారితీసే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. బుధవారం జర్మనీ దేశ విమానయాన సంస్థలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా హెచ్చరిస్తూ కొత్త ఆదేశాన్ని జారీ చేసింది. కాగా ఇరాన్ మీదుగా ఎగురుతున్న అన్ని US వాణిజ్య విమానాలను ఆ దేశం ఇప్పటికే నిషేధించింది. ఇరాన్​ ఎయిర్​ స్పేస్​ను

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...