Homeజిల్లాలునిజామాబాద్​Alai Balai | నగరంలో యువమిత్ర అలయ్ బలయ్

Alai Balai | నగరంలో యువమిత్ర అలయ్ బలయ్

అక్షరటుడే, ఇందూరు: Alai Balai | నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో శుక్రవారం అలయ్ బలయ్ కార్యక్రమం (Alai Balai program) ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన 1988-89 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల యువమిత్ర యువజన సంఘం (Yuvamitra Youth Association) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సందర్భంగా ఒకరినొకరు బంగారం (జమ్మి) ఇచ్చి పుచ్చుకుని ఆలింగనం చేసుకున్నారు.

అలాగే దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 35 ఏళ్ల క్రితం మానిక్ భవన్ పాఠశాలలో (Manik Bhavan School) చదివిన విద్యార్థులు యువమిత్ర యువజన సంఘంగా ఏర్పడి ఏటా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించుకుంటామని సంఘం అధ్యక్షుడు యంసాని రవీందర్ చెప్పారు. సంఘం ఆధ్వర్యంలో అనేక‌ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆపద సమయంలో తోటి విద్యార్థులకు అండగా నిలుస్తున్నామన్నారు. కార్యక్రమంలో యువమిత్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి చింతల గంగాదాస్, కోశాధికారి మూడ వెంకటేష్, పీఆర్వో వారణాసి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.