అక్షరటుడే, వెబ్‌డెస్క్: OG Movie | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘OG’ విడుదల తేది దగ్గర పడుతుండడంతో.. ఈ సినిమా పేరు ఇప్పుడు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అవుతోంది.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా (Action Entertainer) భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టబోయే OG సినిమా (OG Movie) టైటిల్‌ను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ శ్రేణులు విపక్ష నేత పవన్‌పై విరుచుకుపడుతున్నాయి. అయితే సినిమా టైటిల్ OG అంటే ఓజాస్ గంభీర కాగా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వైసీపీ అనుచరులు OGకి మరో అర్థం చెప్పుకొచ్చారు. “ఒంటరిగా గెలవలేనోడు” అని కామెంట్లు చేస్తూ, పవన్ రాజకీయ ప్రయాణాన్ని టార్గెట్ చేస్తున్నారు.
OG Movie | ఓజీపై చర్చ..
వైసీపీ (YCP) ఆరోపణల వెనక కారణాలు చూస్తే.. పవన్ రాజకీయాలలోకి వచ్చాక 2014లో జనసేన స్థాపించాడు. అదే సమయంలో టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చి స్వయంగా పోటీ చేయలేదు. 2019లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ఒంటరిగా గట్టిగా పోటీ చేసినా కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచారు. 2024లో టీడీపీ-బీజేపీతో కలిసి కూటమిగా గెలిచి అధికారాన్ని దక్కించుకున్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందింది. ఇది చూసిన వైసీపీ శ్రేణులు.. పవన్ ఇప్పటివరకు ఒంటరిగా గెలిచిన ట్రాక్ రికార్డు లేదు అని, OG అనే టైటిల్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
వైసీపీ సెటైర్లకు జనసేన ఫ్యాన్స్ గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. సినిమాల పేర్లను రాజకీయాలకు జోడించడం ఎంత తప్పో, వాస్తవాలను మర్చిపోవడమూ అంతే తప్పు అంటున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒంటరిగా కాదు, ప్రజలతో కలిసి గెలవాలనుకుంటున్న నాయకుడు అని అంటున్నారు. OG సినిమాకు హైప్ పెంచాలనే తాపత్రయంలో.. వైసీపీ ఓవర్ ప్రొమోషన్ చేస్తోందని మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ‘యాత్ర 2’ ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయినప్పుడు OG మీద విమర్శలు హాస్యాస్పదం” అంటూ మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. ఇక సినిమాకు ఓజీ టైటిల్ పెట్టడం వెనక అసలు కారణం ఏంటంటే.. పవన్ పోషిస్తున్న పాత్ర పేరు ఓజాస్ గంభీర, కాగా.. అందుకే OG అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కొందరు OG అంటే ‘Original Gangster’ అని, ఇంకొందరు ‘One Goal’, ‘Only God’ అని కూడా చెప్పుకుంటున్నారు.