అక్షరటుడే, వెబ్ డెస్క్ : Ergatla | యువకుడి మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేసి ఆందోళనకు దిగిన ఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad) ఏర్గట్ల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దోంచందా గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి (29) ప్రేమించి మోసపోయానని మనస్తాపంతో నవంబర్ 6న విషం తాగాడు.
దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్ (Hyderabad)లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో బంధువులు యువకుడి మృతదేహంతో శుక్రవారం ఉదయం ఏర్గట్ల పోలీస్ స్టేషన్ (Ergatla Police Station) ముట్టడికి యత్నించారు. తాళ్లరాంపూర్ (Tallarampur) రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో బంధువులు మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
