అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bike Racing | బైక్ రేసులకు పాల్పడుతున్న యువకులను పట్టుకొని ప్రజలు దేహశుద్ధి చేశారు. ఏపీ (Andhra Pradesh)లోని సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల పలువురు యువకులు బైక్‌లతో ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. తమతో పాటు ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ.. వాహనాలపై దూసుకు పోతున్నారు. బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా ఇలాగే శ్రీ సత్యసాయి జిల్లా (Satya Sai District) హిందూపురం మండలం కొల్లకుంట వద్ద బైక్ రేసింగ్ చేస్తూ యువకులు హల్‌చల్ చేశారు. ద్వి చక్ర వాహనాలను ఒక టైర్‌పై లేపి రయ్యుమని దూసుకెళ్లారు. ఈ క్రమంలో మరో వాహనదారుడిని ఢీకొన్నారు. అనంతరం వారే బాధితుడిపై దాడి చేశారు.
Bike Racing | స్థానికుల ఆగ్రహం
బైక్ రేసింగ్‌లకు పాల్పడమే కాకుండా.. బాధితులపై దాడి చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు ఘటన స్థలానికి చేరుకున్నారు. రేసింగ్‌కు పాల్పడుతున్న యువకులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. గ్రామస్తులపై ఎదురుదాడికి దిగిన రేసర్లు, దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా పలువురు మహిళలు సైతం యువకులను చితకబాదారు. ఇలాంటి వారికి ఇది కరెక్ట్ శిక్ష అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రోడ్లపై హంగామా చేస్తూ ఇతరుల ప్రాణాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారిని పట్టుకొని చితక బాదిన స్థానికులను ప్రశంసిస్తున్నారు.