అక్షరటుడే, ఆర్మూర్: Collector Ila Tripathi | రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతులతో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఈ మేరకు ఆర్మూర్ శివారులోని పిప్రి రోడ్డులో ప్రభుత్వం స్థలంతో పాటు, అంకాపూర్ శివారులోని స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించారు.
Collector Ila Tripathi | ప్రతిపాదనలు పంపాలి..
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (integrated residential schools) నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, విద్యార్థులకు భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థలాలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేల స్వభావం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను (high-quality education) అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందన్నారు. ఇప్పటికే మంజూరైన ఆయా నియోజకవర్గాల్లో వీటి నిర్మాణాలు ప్రారంభయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఆమె వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగం సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.