అక్షరటుడే, ఇందూరు: Mp Arvind | ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదినం సందర్భంగా జిల్లాలో బీజేపీ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. ఈ క్రమంలో నగరంలోని దుర్గాదేవి ఆలయం అధ్యక్షుడు అమందు కృష్ణ ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్ పేరుపై (Mp Arvind Birthday) ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఆలయంలో అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో అర్చనలు చేశారు. అనంతరం ఆలయం అధ్యక్షుడు అమందు విజయ్ కృష్ణ (Amand Vijay Krishna) మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటూ తెలంగాణలో (Telanagana) ఫైర్ బ్రాండ్‌గా (Fire brand) నిలిచారన్నారు. ఆపదలో ఉన్న ఎంతోమంది పసిపిల్లల ప్రాణాలు కాపాడుతూ వాళ్లకు అండగా నిలబడుతున్నారని స్పష్టం చేశారు.
ముఖ్యంగా బూత్ కార్యకర్తల (Booth workers) కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఎంతోమంది కార్యకర్తలకు నేనున్నాననే భరోసా ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దుర్గామాత అమ్మవారి (Durga Maatha) ఆశీస్సులతో ఎంపీ అర్వింద్ ఉన్నత స్థానంలో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదశివా, ధాత్రిక రాజేందర్, గంగోనె శ్రీనివాస్, దయవార్ గంగాధర్, గంగోనె రాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.