అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ మున్సిపల్ కార్యాలయం (Banswada Municipal office) ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు రవీందర్ మాట్లాడుతూ.. కార్మికుల ఈఎస్ఐ డబ్బులను వెంటనే చెల్లించాలని, అలాగే ప్రభుత్వ జీవో ప్రకారం కేటగిరీ వారీగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
Banswada | మున్సిపల్ కమిషనర్‌కు వినతి..
డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాటర్‌మెన్లు, ఎలక్ట్రీషియన్ కార్మికులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు (Municipal Commissioner Srihari Raju) అందజేశారు. స్పందించిన కమిషనర్ 20 రోజుల్లో పీఎఫ్‌కు సంబంధించిన పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్షుడు బుజ్జి, సాయిలు, కార్యదర్శి రాజు, శివరాజులు, ముక్కగళ్ల సాయిలు, అత్తర్ గంగారం, స్వాతి, సునంద తదితరులు పాల్గొన్నారు.
