అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | కార్మికులు తమ లేబర్ కార్డులను (labor cards) రెన్యూవల్ చేయించుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పేర్కొన్నారు. ఈ మేరకు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో (Kamareddy Collector Office) భవన నిర్మాణ రంగ సంఘ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
అ సందర్భంగా లేబర్ అధికారి మాట్లాడుతూ.. 2009 తర్వాత లేబర్ కార్డులను వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. గతంలో తీసుకున్న లేబర్ కార్డులు ఏవైతే లాప్స్ అయిపోతే వాటిని సైతం ఈనెల 26వ తేదీన ఎల్లారెడ్డి పట్టణంలో క్యాంప్ నిర్వహించి అన్ని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమావేశంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్, కోశాధికారి ధ్యానబోయిన శ్యామ్, సీనియర్ నాయకులు ఎర్ల సంగమేశ్వర్, మహమ్మద్ ఖలీల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
