Homeజిల్లాలుకామారెడ్డిYellareddy town | కార్మికులు సభ్యత్వ నమోదు చేసుకోవాలి

Yellareddy town | కార్మికులు సభ్యత్వ నమోదు చేసుకోవాలి

- Advertisement -

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy town | భవన నిర్మాణ రంగాల కార్మికులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లేబర్‌ కార్డు (labor card) కలిగి ఉండాలని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్‌ అన్నారు. అలాగే సంఘ సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలో (Yellareddy town) సోమవారం నిర్వహించిన భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కార్మికులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. వాటి పరిష్కారం కోసం యూనియన్‌ కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ మండలిని (Welfare Board) ప్రైవేట్‌పరం చేయనున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తామన్నారు. ఇందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నారాయణ, కోశాధికారి ధ్యానబోయిన శ్యామ్, కార్పెంటర్‌ అధ్యక్షుడు నర్సింలు, సీనియర్‌ నాయకులు ఉప్పరి సాయిబాబా, బెల్దార్‌ తుకారాం, రామాయంపేట అశోక్, తన్నీరు చిరంజీవి, లింగంపేట్‌ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ రజాక్, తదితరులు పాల్గొన్నారు.