అక్షరటుడే, ఇందూరు: Seasonal diseases | సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్(Additional Collector Ankit) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టట్లోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా డెంగీ (Dengue), మలేరియా(malaria), టైఫాయిడ్ (typhoid), విష జ్వరాల వంటి వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా డెంగీ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా మురికి కాల్వల్లో ఆయిల్ బాల్స్ (Oil Balls) వేయాలన్నారు. పీహెచ్సీల నుంచి ప్రతిరోజూ సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసుల వివరాలను తెప్పించుకోవాలని సూచించారు. ఎక్కడైనా కేసులు నమోదైతే చుట్టుపక్కల నివాస గృహాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. వారానికి కనీసం రెండుసార్లు తప్పనిసరిగా దోమల నివారణ మందు పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
1 comment
[…] పరీక్షలు చేయాలని, సీజనల్ వ్యాధులు(Seasonal Diseases) ప్రబలకుండా ముందస్తు చర్యలు […]
Comments are closed.