అక్షరటుడే, ఇందూరు: Municipal Reservations | మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థతో (Nizamabad Municipal Corporation) పాటు భీమ్గల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీ వార్డులకు మహిళా రిజర్వేషన్లను నిర్ణయించనున్నారు. ఈ మేరకు ఈనెల 17న కలెక్టర్ కార్యాలయంలో డ్రా తీయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించి ఉదయం 10 గంటలకు, ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి 10.15 గంటలకు, బోధన్ మున్సిపాలిటీలకు సంబంధించి 10:30 గంటలకు ఉంటుందన్నారు. అలాగే నగరపాలక సంస్థ డివిజన్లో మహిళా రిజర్వేషన్ల డ్రా ప్రక్రియ 11 గంటలకు ఉంటుందని పేర్కొన్నారు.