అక్షరటుడే, వెబ్‌డెస్క్: Women World Cup 2025 | ఆసియా కప్ 2025లో Asia Cup 2025 పురుషుల విభాగంలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
సూర్యకుమార్ యాదవ్ సేన ఒక్క ఓటమి లేకుండా టోర్నీని ముగించి తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ -పాక్ తలపడగా, అంతకు ముందు రెండు సార్లు పోటీ పడ్డాయి.
మొత్తంగా టోర్నీలో మూడు సార్లు పాక్- భారత్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగగా.. అన్నింటా భారత్ విజయపతాకం ఎగురవేసింది.
అయితే ఈ విజయోత్సాహం ఇంకా కొనసాగుతుండగానే, మరోసారి ఇండియా–పాకిస్థాన్ పోరు తెర మీదకు వచ్చింది. కాగా, ఈసారి బరిలోకి దిగేది మాత్రం మహిళల జట్లు.
Women World Cup 2025 | మరోసారి పోటీ..
మహిళల వన్డే ప్రపంచ కప్ (Women’s One Day World Cup) 2025 (World Cup 2025) నేడు ప్రారంభం కానుంది. అక్టోబరు 5వ తేదీన (ఆదివారం) కొలంబో (Colombo) లోని ప్రేమదాస స్టేడియం (Premadasa Stadium) వేదికగా భారత్–పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరుకు ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. భారత్‌లో పాకిస్థాన్ ఆడేందుకు సుముఖంగా లేకపోవడంతో, ఒప్పందం ప్రకారం ఈసారి ఇరు జట్ల మధ్య పోటీ తటస్థ వేదిక అయిన శ్రీలంకలోనే జరగనుంది.
ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక Sri Lanka కలిసి సంయుక్త ఆతిథ్యం ఇస్తున్నాయి. సెప్టెంబరు 30న మధ్యాహ్నం 3 గంటలకు గువహటి Guwahati వేదికగా భారత్–శ్రీలంక మధ్య తొలి మ్యాచ్‌తో వరల్డ్‌కప్ ఆరంభం కానుంది.
పాకిస్థాన్ Pakistan జట్టు తమ మొదటి మ్యాచ్‌ను అక్టోబరు 2న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. భారత్ మాత్రం లీగ్ దశలో పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, సౌతాఫ్రికా South Africa, ఆస్ట్రేలియా Australia, ఇంగ్లండ్ England, న్యూజిలాండ్ New Zealand, బంగ్లాదేశ్ Bangladesh జట్లను ఎదుర్కోనుంది.
సెమీ ఫైనల్స్ అక్టోబరు 29, 30 తేదీల్లో జరగనుండగా, నవంబరు 2న ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగియనుంది. మరి ఈ సారి అయినా భారత మహిళ జట్టు వరల్డ్ కప్‌ని ముద్దాడుతుందా.. అనేది చూడాలి.
టీమిండియా ఇటీవల పురుషుల విభాగంలో సాధించిన గెలుపుతో మానసికంగా పైచేయి సాధించింది. అదే జోష్‌ను మహిళల జట్టు కూడా కొనసాగించాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
Women World Cup 2025 | భారత మహిళల జట్టు :
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్టిక భాటియా, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్.
Harmanpreet Kaur (Captain), Smriti Mandhana (Vice-Captain), Pratika Rawal, Harleen Deol, Jemimah Rodrigues, Richa Ghosh, Yastika Bhatia, Renuka Singh Thakur, Deepti Sharma, Sneha Rana, Sri Charani, Radha Yadav, Amanjot Kaur, Arundhati Reddy, Kranthi Goud