అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | సహజీవనానికి సహకరించట్లేదని మహిళను హత్య చేసిన యువకుడు కటకటాల పాలయ్యాడు.
వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి (One Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బస్టాండ్ పక్కన ఉన్న రైల్వే కాంపౌండ్ (Railway Compound) వాల్ సమీపంలో ఈనెల 6న ఒక గుర్తు తెలియని మహిళా మృతదేహం కనుగొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతురాలు కామారెడ్డి (Kamareddy) జిల్లా లింగాయపల్లి (Lingayapally) గ్రామానికి చెందిన గులాల సవితగా గుర్తించారు. అయితే మృతురాలితో సహజీవనం చేస్తున్న గన్నారం గ్రామానికి చెందిన పల్లె రాకేశ్ అలియాస్ నవీన్ అదుపులోకి తీసుకొని విచారించారు.
తనతో సహజీవనం కొనసాగించటానికి నిరాకరించిన కారణంగా ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చగా ఆయనను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మృతురాలికి ఒక కూతురు ఉండగా, నేరస్తుడు గతంలో చోరీ కేసులో జైలుకి వెళ్లి వచ్చాడు.